ysrkadapa.info
దానం చేస్తే జన్మ ధన్యం - YSR Kadapa News Information
తనువు లస్థిరమని ధనము తాగాదని ధర్మశీలుడగచు తగినపాటి దానమిచ్చువాడె ధన్యాత్ముడిలలోన కాళికాంబ!హంస!కాళికాంబ. శరీరాలు శాశ్వతమైనవి కాదు, డబ్బుకూడా శాశ్వతం కాదు. అందువల్ల ధర్మాన్ని తెలుసుకున్నవ్యక్తి తనకు వీలైనంతవరకు దానం చెయ్యాలి. అలా చేసిన వ్యక్తే ధన్యుడౌతాడు. ఇది బ్రహ్మంగారు తనకాలంనాటి ఆర్థికవ్యత్యాసాలను, పేదరికాన్ని చూసి చెప్పిన పద్యం. కంటిముందు పేదరికం కనిపిస్తుంటే కర్మసిద్ధాంతాన్ని నమ్మమని ఆరన బోధించలేదు. ధనవంతులకు శక్తికొలది దానం చెయ్యమని పిలుపు నిచ్చాడు. సంపద కొంతమంది చేతుల్లో పోగు పడటాన్ని వేమన, బ్రహ్మంగార్లు ఆమోదించలేదు. …